వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



14, నవంబర్ 2009, శనివారం

అతడు సినిమా - దర్శకుని ప్రతిభ

టెక్నాలజీ పరంగా మనము అంటే మన తెలుగు సిని పరిశ్రమ చాలాఎత్తుకు ఎదిగినది అంటూ ప్రతిఒక్కరూ అంటు ఉన్నా ఈ రోజుల్లో మన దర్శకులలోని దర్శకత్వములో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒకసారి చూద్దామా !
నేను ఇష్టపడే ఒక సినిమా అతడు సినిమా యెంత అద్భుతంగా ఉందొ మాటల్లో చెప్పలేను.కాని ఈ సినిమా లోని లోపాలను ఒకసారి మీ కోసము ...................
అతడు
1.సినిమా మొదటిలో హీరో అదే మహేష్ బాబు చిన్నతనములో ఒక Hotel లో పనిచేస్తుంటాడు .ఒక రౌడి కారులో వస్తే అతడికి టీ ఇవ్వడానికి వెళ్లి టీ ఇచ్చి కాల్చి చంపుతాడు. ఇంతకూ ఆ రౌడి ని ఎందుకు కాల్చి చంపినట్లు .
దీనికీ మూడే కారణాలు :
  1. ఆ పిల్లవాడు డబ్బు తీసుకొని చంపి ఉండాలి .
  2. ఆ పిల్లవాడికి పిచ్చి అయినా ఉండాలి .
  3. ఆ పిల్లవాడు సైకో అయినా కావాలి.

కాని పై కారణాలు ఏవి సినిమాలో చూపించలేదు.

2. శివారెడ్డి హత్య తర్వాత హీరో మహేష్ బాబు చరణ్ రాజ్ నుండి తప్పించుకునే సందర్భములో మన దర్శకుని ప్రతిభ ఒకసారి ............




పై చిత్రాలను బాగా పరిశీలించండి .మొదటి రెండు చిత్రాలలో ఎక్కడా రైలు గాని , రైలు పట్టాలు గాని లేవు .కాని తర్వాతి రెండు చిత్రాలలో రైలు మరియు పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక మీరే చెప్పండి మరి మన దర్శకుల ప్రతిభ .

3.శివారెడ్డి హత్య తర్వాత చరణ్ రాజ్ డైరెక్ట్ గా మహేష్ బాబు దగ్గర ఎందుకు వెళ్ళినట్లు . చరణ్ రాజ్ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నడా ?

మహేష్ బాబు అడ్రస్ చరణ్ రాజ్ కు ఎవరు చెప్పారు ?


దీనికి జవాబు దర్శకుడే చెప్పాలి .


4.చంచల్ గూడ జైలు లో సాదు దగ్గరకు ప్రకాష్ రాజ్ వెళ్ళినప్పుడు ,సాదు కు ప్రకాష్ రాజ్ శివారెడ్డి ఫోటో చుయించితే ,సాదు ఇది ప్రోఫ్ఫెసోనల్స్ చేసారు అని అంటాడు.సోను సూద్ ఫోటో చూసి వీడు చంపడు ప్లాన్ మాత్రమె చేస్తాడు అని అంటాడు. మరి సోను సూద్ షూటింగ్ నేర్చుకున్నట్లు సినిమాలో ఎక్కడ చుయించలేదు.


సినిమా లో ఇన్ని లోపాలు ఉన్నాయి అంటే అది మన తప్పే .ఎందుకంటె ప్రేక్షకులు పిచ్చివాళ్ళు కాబట్టి .ఈ మద్య రాంగోపాల్ వర్మ గారు అడవి చిత్రం కోసం ఒక చానల్లో అంటాడు .


"మాకు ఇష్టము వచ్చినట్లు సినిమా తీస్తాము ,ప్రేక్షకులు చూస్తె చూడమను లేకుంటే లేదు "


దీనిని బట్టి అర్తమౌతుంది ప్రేక్షకులపై దర్శకులకు యెంత నమ్మకముందో .................


తర్వాతి పోస్ట్ లో మగధీర సినిమాతో మల్లి కలుస్తాను.............

6 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

సినిమాని సినిమాలాగా చూడాలి గానీ ఏదో మైకెలేంజిలో వేసిన ఆర్టులాగా చూస్తానంటే ఎలాగు? అందులో తెలుగు సినిమాని?

కన్నగాడు చెప్పారు...

సినిమాలలో లోపాలు లేవని అనలేం కాని మీరు చూపినవ 1,3,4 లోపాలుగా పరిగణించలేం,
చిన్నవాడు దేని కోసం చేసినా, దాన్ని ముందుగా చూపితే ప్రేక్షకుడికి థ్రిల్ పోతుంది. ఆ తరువాత కథ హైదరాబాదుకి మారటంతో ఆ అంశాన్ని కొనసాగిస్తే సాగతీత అవుతుంది.
చరణ్ రాజ్ కోటకి అనుకూలంగా ఉన్నట్టుగానే చూపిస్తాడే?
ఇక నాలుగో దానికీ మొదటి జవాబు లాంటిదే, సోనుసుద్ ని వీలైనంత తక్కువగా చూపిస్తేనే బాగుంటుందని అలాంటి సన్నివేశాలు పెట్టలేదనుకుంటా.
నేను కేవలం మీరిక్కిడ చెప్పినవి మీ వ్యాఖ్యకి సమర్దనీయమైనవి కాదంటున్నా.

రచన చెప్పారు...

కొత్త పాళీ గారు,
స్క్రిప్ట్ కూడా ఆర్ట్ లాంటిదే .

రచన చెప్పారు...

కన్నగాడు గారు ,
చిన్న పిల్లవాడు చేసిన దానిని ముందే చూపమని నేను చెప్పలేదు. తర్వాత సాదు దగ్గర పని చేసే మనిషికి గన్ బోరికినప్పుడు ,అతడు అడిగి నప్పుడు అయినా ఎందుకోసము చంపాడో ఆ పిల్లవాడి తో చెప్పిచి ఉంటె బాగుండేది . వాళ్ళ తల్లి దండ్రులను చంపినదుకు చంపి ఉండవచ్చును కదా ! చెప్పేది స్పష్టంగా చెపితే చాలు .ప్రతి ఒక్కటి చూయించమని చెప్పడము లేదు .3 వ విషయములో కూడా అంతే. చెప్పేది స్పష్టంగా చెపితే చాలు .ప్రతి ఒక్కటి చూయించమని చెప్పడము లేదు. సోనుసుద్ తో కిక్ boxing చూయించే బదులు గన్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తున్నట్లు చూయిస్తే సరిపోయేది .అవసరమైనవి చూయించడము సాగతీత కాదు కదా !

Anil Dasari చెప్పారు...

స్క్రీన్‌ప్లే లోపాలు టైటానిక్ లో కూడా లెక్కలేనన్ని ఉన్నాయండీ. అన్నో ఇన్నో అవీ లేనిదే ఏ సినిమా కూడా సంపూర్ణం కాదు. అయితే ఉన్నవన్నీ లోపాలే అయితేనే సమస్య. అధిక శాతం తెలుగు సినిమాల్లో ఉండేది అవే మరి. 'అతడు' ఉన్నంతలో మెరుగు.

మీకొచ్చిన మూడో డౌటే సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకీ వచ్చింది :-)

ఇక నాలుగో డౌట్: సోను సూద్ పాత్ర గురించి రాహుల్ దేవ్ పాత్రకి తెలిసింది అంతవరకే. అతను చాన్నాళ్లుగా జైల్లో ఉన్నాడు. ఆ మధ్యకాలంలో సోను సూద్ ఏమేం నేర్చుకున్నాడో ఇతనికి తెలీకపోవచ్చుగా? అందాకా ఎందుకు, కలిసి మెలిసి తిరిగిన మహేష్‌కే సోను సూద్ గురించి పూర్తిగా తెలీదు. పైగా, ప్రేక్షకులకి రహస్యాలన్నీ ముందే చెప్పేస్తే కథలో చివర్లో విప్పటానికి ఇంకేం మిగిలుంటుంది? ఇది లోపం అనలేం. మీరన్న మొదటిది కూడా ఇదే కోవకి వస్తుంది. ఆ కుర్రాడికి మీరన్న మూడు కారణాలు కాక మరే కారణమో ఉండొచ్చు. అది ఏదన్నది కథకి అప్రస్తుతం కావచ్చు.

మీరు లేవనెత్తిన రెండో పాయింట్ మాత్రం సమంజసంగా ఉంది. సినిమా చూసినప్పుడు అది చాలా సిల్లీగా అనిపించింది. అంతకన్నా సిల్లీగా అనిపించింది మరోటి ఉంది.

ఒక సీబీఐ ఆఫీసర్‌కి ఫలానావాడు దొంగ అనే అనుమానముంటే వెళ్లి దర్జాగా 'నీ మీద అనుమానంగా ఉంది. నీ వేలిముద్రలు ఇవ్వు' అని అడిగి తీసుకునే అధికారం ఉంది కదా. దర్యాప్తు జరుగుతున్నది చాలా హై ప్రొఫైల్ కేసు. అవసరమైతే అనుమానితులందర్నీ కస్టడీలోకి తీసుకునే అధికారాలూ ఉంటాయి వాళ్లకి. అవేమీ లేనట్లు ఉప్రకాష్ రాజ్ పార్ధుకి అనుమానం రాకుండా అతని వేలి ముద్రలు తీసుకోటం కోసం నానా తంటాలు పడటం చూస్తే నవ్వు రాలేదు?

రచన చెప్పారు...

అబ్రకదబ్ర గారు ,
నేను
తెలుగు సినిమా ల గురించి ప్రస్తావించాను అక్కడ .పాత తెలుగు సినిమాలో తప్పులు లేని సినిమాలను ఎన్నింటిని చూపించమంటారు .జురాసిక్ పార్క్ లో కూడా తప్పులు ఉన్నాయి .నేను వాటి గురించి మాట్లాడడము లేదు ఇక్కడ.
" సోను సూద్ పాత్ర గురించి రాహుల్ దేవ్ పాత్రకి తెలిసింది అంతవరకే. అతను చాన్నాళ్లుగా జైల్లో ఉన్నాడు. ఆ మధ్యకాలంలో సోను సూద్ ఏమేం నేర్చుకున్నాడో ఇతనికి తెలీకపోవచ్చుగా?"
అని అన్నారు అదే సమయములో మహేష్ బాబు గురించి సోను సూద్ కు తెలిసిది కూడా అంతే .మహేష్ బాబు కూడా మారి ఉండవచ్చు కదా !
ఇక మూడవ విషయానికి వస్తే మహేష్ బాబు కోటా శ్రీనివాస రావు ఇంట్లోకి టెలిఫోన్ ఆపరేటర్గా వెళ్లి అన్ని విషయాలు రికార్డ్ చేస్తాడు .ఆ సమయములో రాహుల్ దేవ్ ,గురించి చెప్పినట్లు గానే చరణ్ రాజ్ గురించి చెప్పి ఉంటే భాగుండేది .ఎందుకటే అప్పటికే కథ అందరికి తెలిసి పోయింది .ఇక్కడ దాచాల్సిన పని లేదు.
మీరు చెప్పేది ఎలా ఉందంటే దృశ రూపకంగా తప్పులు ఉంటేనే ,తప్పులు అని మిగతా ఏ రూపములో ఉన్నా అవి తప్పు లు కాదా! తప్పులు ఏ రూపము లో ఉన్నా అవి తప్పులే .
"ఆ కుర్రాడికి మీరన్న మూడు కారణాలు కాక మరే కారణమో ఉండొచ్చు. అది ఏదన్నది కథకి అప్రస్తుతం కావచ్చు."
ఆ కారణము ఏంటి ? ఎందుకంటే ఇది హీరోను పరిచయము చేసే సందర్బము .ఇలాంటి ముఖ్యమైన సందర్బము అప్రస్తుతము ఎలా అవుతుంది?

"ఒక సీబీఐ ఆఫీసర్‌కి ఫలానావాడు దొంగ అనే అనుమానముంటే వెళ్లి దర్జాగా 'నీ మీద అనుమానంగా ఉంది. నీ వేలిముద్రలు ఇవ్వు' అని అడిగి తీసుకునే అధికారం ఉంది కదా. దర్యాప్తు జరుగుతున్నది చాలా హై ప్రొఫైల్ కేసు. అవసరమైతే అనుమానితులందర్నీ కస్టడీలోకి తీసుకునే అధికారాలూ ఉంటాయి వాళ్లకి. అవేమీ లేనట్లు ప్రకాష్ రాజ్ పార్ధుకి అనుమానం రాకుండా అతని వేలి ముద్రలు తీసుకోటం కోసం నానా తంటాలు పడటం చూస్తే నవ్వు రాలేదు"
పై వాఖ్య బాగా నచ్చిందండి . అలాగే ప్రకాష్ రాజ్ తన తో టి సీబీఐ ఆఫీసర్ తో "యెంత తీసుకున్నావో చెప్పు " అని అంటాడు .అతడు నిజంగా తీసుకునాడో లేదో ఆ దేవుడికే తెలియాలి లేదా ఆ డైరెక్టర్ కి తెలియాలి .

~~~~~~~~~~ఎంతైనా మీ విశ్లేషణ భాగుందండి ~~~~~~~~~~~~

కామెంట్‌ను పోస్ట్ చేయండి