వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



13, నవంబర్ 2009, శుక్రవారం

మన తెలుగు సినిమాలు - దర్శకుల ప్రతిభ

టెక్నాలజీ పరంగా మనము అంటే మన తెలుగు సిని పరిశ్రమ చాలాఎత్తుకు ఎదిగినది అంటూ ప్రతిఒక్కరూ అంటు ఉన్నా ఈ రోజుల్లో మన దర్శకులలోని దర్శకత్వములో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒకసారి చూద్దామా !
నేను ఇష్టపడే ఒక సినిమా అతడు సినిమా యెంత అద్భుతంగా ఉందొ మాటల్లో చెప్పలేను.కాని ఈ సినిమా లోని లోపాలను ఒకసారి మీ కోసము ...................
అతడు
1.సినిమా మొదటిలో హీరో అదే మహేష్ బాబు చిన్నతనములో ఒక Hotel లో పనిచేస్తుంటాడు .ఒక రౌడి కారులో వస్తే అతడికి టీ ఇవ్వడానికి వెళ్లి టీ ఇచ్చి కాల్చి చంపుతాడు. ఇంతకూ ఆ రౌడి ని ఎందుకు కాల్చి చంపినట్లు .
దీనికీ మూడే కారణాలు :

  1. ఆ పిల్లవాడు డబ్బు తీసుకొని చంపి ఉండాలి .
  2. ఆ పిల్లవాడికి పిచ్చి అయినా ఉండాలి .
  3. ఆ పిల్లవాడు సైకో అయినా కావాలి.

కాని పై కారణాలు ఏవి సినిమాలో చూపించలేదు.

2. శివారెడ్డి హత్య తర్వాత హీరో మహేష్ బాబు చరణ్ రాజ్ నుండి తప్పించుకునే సందర్భములో మన దర్శకుని ప్రతిభ ఒకసారి ............



పై చిత్రాలను బాగా పరిశీలించండి .మొదటి రెండు చిత్రాలలో ఎక్కడా రైలు గాని , రైలు పట్టాలు గాని లేవు .కాని తర్వాతి రెండు చిత్రాలలో రైలు మరియు పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక మీరే చెప్పండి మరి మన దర్శకుల ప్రతిభ .

3.శివారెడ్డి హత్య తర్వాత చరణ్ రాజ్ డైరెక్ట్ గా మహేష్ బాబు దగ్గర ఎందుకు వెళ్ళినట్లు . చరణ్ రాజ్ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నడా ?

మహేష్ బాబు అడ్రస్ చరణ్ రాజ్ కు ఎవరు చెప్పారు ?

దీనికి జవాబు దర్శకుడే చెప్పాలి .

4.చంచల్ గూడ జైలు లో సాదు దగ్గరకు ప్రకాష్ రాజ్ వెళ్ళినప్పుడు ,సాదు కు ప్రకాష్ రాజ్ శివారెడ్డి ఫోటో చుయించితే ,సాదు ఇది ప్రోఫ్ఫెసోనల్స్ చేసారు అని అంటాడు.సోను సూద్ ఫోటో చూసి వీడు చంపడు ప్లాన్ మాత్రమె చేస్తాడు అని అంటాడు. మరి సోను సూద్ షూటింగ్ నేర్చుకున్నట్లు సినిమాలో ఎక్కడ చుయించలేదు.

సినిమా లో ఇన్ని లోపాలు ఉన్నాయి అంటే అది మన తప్పే .ఎందుకంటె ప్రేక్షకులు పిచ్చివాళ్ళు కాబట్టి .ఈ మద్య రాంగోపాల్ వర్మ గారు అడవి చిత్రం కోసం ఒక చానల్లో అంటాడు .

"మాకు ఇష్టము వచ్చినట్లు సినిమా తీస్తాము ,ప్రేక్షకులు చూస్తె చూడమను లేకుంటే లేదు "

దీనిని బట్టి అర్తమౌతుంది ప్రేక్షకులపై దర్శకులకు యెంత నమ్మకముందో .................

తర్వాతి పోస్ట్ లో మగధీర సినిమాతో మల్లి కలుస్తాను.............

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

1.డబ్బు తీసుకున్నాడు....
3.చరణ్ రాజ్ కూడా డబ్బు తీసుకున్నాడు కోట నుంచి....
4."సోను సూద్ షూటింగ్ నేర్చుకున్నట్లు సినిమాలో ఎక్కడ చుయించలేదు."....సొను సూద్ తల దువ్వుకోవడం,స్నానం చెయ్యడం ఏమి చూపించలేదు.... అంటే అతడు ఇవేమి చెయ్యనట్లా??....

ఒక్క ట్రైన్ విషయం లో మాత్రం మీతో నేను ఏఖీభవిస్తాను...ట్రైన్ కాకుండా బస్సు పెట్టుంటే బాగుండేది...

రచన చెప్పారు...

హరీష్ గారు ,
1.పిల్లవాడు ఎక్కడా డబ్బు తీసుకోలేదు .
3. చరణ్ రాజ్ కూడా డబ్బు తీసుకున్నాడు కోట నుంచి అని మీరు అంటున్నారు .కాని ఇద్దరు కలిసినట్లు కానీ ఫోన్ లో మాట్లాడినట్లు కాని ఎక్కడా లేదు. ప్రకాష్ రాజ్ కూడా ఇదే విషయం ప్రస్తావిస్తాడు కాని దానికి కొనసాగింపు లేదు .
4. ."సోను సూద్ షూటింగ్ నేర్చుకున్నట్లు సినిమాలో ఎక్కడ చుయించలేదు."....సొను సూద్ తల దువ్వుకోవడం,స్నానం చెయ్యడం ఏమి చూపించలేదు.... అంటే అతడు ఇవేమి చెయ్యనట్లా??.... అని మీరు అన్నారు ,సాదు ,ప్రకాష్ రాజ్ తో అన్నది ఒకసారి చూడండి. మహేష్ బాబు , సోను సూద్ ఇద్దరు కలసి కిక్ boxing ప్రాక్టీసు చేస్తారు కాని షూటింగ్ ప్రాక్టీసు చేయరు.మరి అది ఎందుకు చుయించినట్లు.అవసమైనది చూయించక , అవసరము లేనిది చూయిస్తే ఎలాగండి ?మీరే ఆలోచించండి .
మీరు ఒకసారి CD చూడండి దయచేసి !

అజ్ఞాత చెప్పారు...

అన్నీ చూపించనక్కర్లేదు.....నాకు అర్దమయ్యింది.....చాలా మందికి కూ డా అర్దమయ్యింది.....అదే పని గా తప్పులు వెదకాలని వెదికితే మాత్రం అర్దం కాదు....

1.తర్వాతి సీను లో పిల్లాడు తిండి కోసం తిరుగుతుంటాడు....దాని బట్టి ఆలోచిస్తే పొట్ట నింపుకోడానికి చంపాడు అని అర్దం అవుతుంది.
2.ప్రకా ష్ రాజ్ చేత ప్రస్తావించడం అంటే..మనకు చెప్పడమే..."he is corrupted. so, case కి అతడి నుంచి ఎక్కువ సహాయం పొందలేము" అని

ఒక్క విషయం
ఇది సినిమా .....క్లాసు లో పాఠం కాదు....

రచన చెప్పారు...

హరీష్ గారు ,
మీరు ఓల్డ్ మూవీస్ చూడండి.స్క్రిప్ట్ యెంత కరెక్ట్ గా ఉంటుందో .నేను తప్పులను వెతకడము లేదు .ఉన్నా తప్పులను చుయిస్తున్నాను.
అందుకే ఈ మద్య ఒక ప్రొడ్యూసర్ తో కొత్త డైరెక్టర్ అన్నాడట " ఈ మద్య స్క్రిప్ట్ గురించి ఎవరు పట్టించు కుంటారు సర్ ,మనము ఏది తీస్తే ప్రేక్షకులు అదే చూస్తారు "అని .నిజంగా మన వల్లే ఇలాంటి డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీ కి వస్తున్నరేమో.ఫ్రేమ్ ,ఫ్రేమ్ కు సినిమాలో ఎక్కడో ఒక చోట సంబందము ఉండాలి .అన్ని మనమే అనుకుంటూ పొతే మరి డైరెక్టర్ ఎందుకు ? మీకే తెలియాలి .సినిమా లో ఈ తప్పులు ఉన్నాయి అని చెప్పడములో తప్పులేదుగా .ఇంకొక సారి ఒకటికి రెండు సార్లు స్క్రిప్ట్ ను చెక్ చేసుకుంటారుగా.

అజ్ఞాత చెప్పారు...

సినిమా పట్ల మీకున్న అభిమానం నచ్చింది....
ఇప్పటి తరం లో గ్రహణ శక్తి బాగా ఎక్కువైంది...(grasping power)
అన్నీ ఒలిచి పెడితే సోది చూపిస్తున్నాడు రా అంటారు.....(ముఖ్యంగా థ్రిల్లర్స్ లో)

సున్నితమైన సినిమాలైతే ప్రతి భావాన్ని పలికించాలి....థ్రిల్లర్స్ తీసేప్పుడు ప్రేక్షకుడి మెదడు కి కొంత మేత వెయ్యాలి..అప్పుడే సినిమాను నిద్రపోకుండా చూస్తాడు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి