వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



8, సెప్టెంబర్ 2009, మంగళవారం

నల్లధనం



భారతదేశాన్ని ఎవరు రక్షించగలరు? టాక్స్‌పేయర్స్ సొత్తు యిలా చీకటి లోకాలలో కనుమరుగైపోయి, నల్లధనంగా మారిపోతుంటే, స్విస్ బ్యాంక్స్ లాంటి విదేశీ బ్యాంక్స్లో కోట్ల కోట్లు డాలర్స్ రహస్య ఖాతాలలో 'జమ' అయిపోయి, మురిగిపోతుంటే గుడ్లప్పగించి చూడడం, చెవులప్పగించి వినడంతప్ప, సామాన్య భారతీయ పౌరుడు చేయగలిగిన దేముంది గనక.
ఒలింపిక్ ఈవెంట్ అయ్యుంటే...
ఇలా, బ్లాక్ మనీని, విదేశీ బ్యాంకుల ఖాతాలలో పోటాపోటీల మీద జమచెయ్యడం కూడా, ఒలంపిక్ ఈవెంట్ అయ్యంటే. భారతదేశం అవలీలగా ఒలింపిక్ స్వర్ణపతాకం గెలుచుకుని వుండేది.
రెండవ స్థానంలో...
నిన్న మొన్నటిదాకా అఖండమైన యు.ఎస్.ఎస్.ఆర్‌గా విలసిల్లిన మిఖైల్ గోర్బచేవ్ పుణ్యమా అని ముక్కచెక్కలయిపోయిన సోవియట్ రిపబ్లిక్‌లో ఒక చిన్న దేశంగా బిగిలిపోయిన రష్యా 'నల్లధనం' విషయంలో రెండవస్థానం ఆక్రమించింది. కాని భారతదేశవాసులకి స్విస్ బ్యాంకులో నల్లధనం ఖాతాలలో 4వ వంతు కూడా వాళ్లకి లేవు.
ఇక అమెరికా సంయుక్త, రాష్ట్రాలు (యు.ఎస్.ఎ జాబితాలో 5వ స్థానంలో కూడా లేదు. అంటే యు.ఎస్ వాసులకి నల్లధనం అవసరం లేదనేగా అర్థం. అసలు పైరసీలకీ, పైరవీలకీ, మాఫియా, అండర్ వరల్డ్ డాన్స్‌కీ, ఉగ్రవాద అధినేతలకీ ఆయువుపట్టయిన యు.ఎస్. కంటే, ఇండియన్స్‌కే 'నల్లధనం' ఎక్కు అంటే విచిత్రమే కదా? ఒకవైపు 67 శాతం ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితులలో, కొందరు 'పెట్టి పుట్టిన వాళ్లు, డబ్బు ఎక్కువ, ఎలా, ఎప్పుడు దాచుకోవాలో తెలియక హైపర్ టెన్షన్‌కీ, హార్డ్ ట్రబుల్స్‌కీ, పక్షవాతాలకీ గురిఅవుతున్నారంటే, విడ్డూరంగా లేదూ?
గోప్యతకి మారుపేరుగా...
రహస్యమైన లావాదేవీలకీ, గోప్యతకీ మారు పేరయిన స్విస్ బ్యాంక్ చివరికి అంతర్జాతీయంగా ఒత్తిడులకి లొంగిపోయి, ఆయా దేశాల ప్రభుత్వాలు కోరిన పక్షంలో, ఖాతాదారుల వివరాలు అందజేస్తామని ప్రకటించింది. కాని, ఇప్పటిదాకా, ఇండియా ఈ విషయంలో ఉదాసీనంగానే వ్యవహరించడానికి కారణం ఏమిటి? లోగట్టు పెరుమాళ్ల కెరుక!
అవినీతి వెలికి తేవాలంటే...
అసలు తరతరాలుగా, భారతజాతిని పట్టి పీడిస్తున్న అవినీతిని వెలికి తేవాలంటే, ఇదొక స్వర్ణావకావం. మనం దేశం విదేశాలకి బాకీ పడిన సొమ్ముకంటే 13 రెట్లు అధికమైన స్విస్ బ్యాంక్ నల్లధనం (బ్లాక్‌మనీ) డిపాజిట్స్. మొత్తం ఎంతో తెలుసా? 1500 బిలియన్ యు.ఎస్.డాలర్స్ కంటే మించిపోయిందంటే, మీకు గుండెదడ వచ్చినట్టుందా?
నీతి నియమాలకి అతీతులైన పారిశ్రామిక వేత్తలూ, హత్యలకీ, దారుణ మారణ హోమాలకీ పల్పడే రాజకీయ నాయకులూ, ఐ.ఎ.ఎస్. ఐ.ఆర్.ఎస్, ఐ.పి.ఎస్. అధికారులూ, భారతీయ చట్టాలనీ, నీతినియమాలనీ, సాంఘిక న్యాయాలనీ అతిక్రమించి, సంపాదించిన లంచాలలో, అక్రమార్జనలలో దాదాపు 1500 మిలియన్స్ డాలర్స్, స్విస్ బ్యాంకులో నిల్వ చేసుకున్నారంటే వాళ్లని 'దేశద్రోహులని' నిందిచినా చాలదేమో!
పేద ప్రజానీకానికి పంచిపెడితే..
ఈ 1500 బిలియన్స్ యు.ఎస్,డాలర్స్ 45 కోట్ల నిరుపేద భారతీయ ప్రజానీకానికి సమానంగా పంచిపెడితే, ఒక్కొక్కళ్లకీ నిక్షేపంగా, 1,00,000 వస్తాయి మరి! నిజానికి ఇదంతా పేదప్రజల కడుపుకొట్టి సంపాదించిన డబ్బేగా?
ఇదంతా భారతదేశానికి తిరిగి వస్తే, మనం ఇంతవరకూ విదేశాలనుంచి చేసిన అప్పులు కూడా, అవలీలగా 24 గంటలలోగా తీర్చేయవచ్చు. అలా తీర్చేశాక కూడా ఇంకా విదేశీఋణాల మొత్తం కంటే 12 రెట్లు ఎక్కువ సొమ్ము మన దగ్గర మిగిలిపోతుంది. దీన్ని ఎందులోనైనా సక్రమంగా పెట్టుబడిపెడితే, వచ్చే వడ్డీతో, హాయిగా మన దేశ కేంద్ర వార్షిక బడ్జెట్ కావలసిన నిధులు సమకూర్చుకోవచ్చు.
టాక్సెస్ ఎబాలిష్ చేసినా...
ఏటేటా ప్రజ మీద విధించే సుంకాలన్నీ తొలగించినా ఇంకా మనం హాయిగా మనుగడ సాగించగలం. అసలు ఏటేటా, 80,000 మంది మన దేశం నుంచి స్విడ్జర్లాండ్‌కి వెడుతుంటారు. అందులో 25,000 మంది తరచుగా వెళుతుంటారు. ఎందుకో తెలుసా? తమ 'నల్లధనం' ఖాతాల వివరాలు తెలుసుకోవడానికి మరి!






0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి