ఉగ్రవాదం నేడు చాలా దేశాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో విరుచుకుపడుతోంది. మన దేశంలోనూ అనేక చోట్ల ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటున్నాయి.ముంబాయి , ఢిల్లీ, అస్సాం, హైదరాబాద్, అహ్మదాబాద్, మాలెగావ్, జైపూర్ ఇలా అనేక ప్రాంతాలకు ఇవి విస్తరించాయి. జాతి పిత మహాత్మ గాంధీని ఒక మతోన్మాది బలిగొన్నాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మత ఛాందస ఉగ్రవాదులు పొట్టన బెట్టుకోగా, రాజీవ్ గాంధీ ఎల్‌టీటిఇ మానవ బాంబు దాడిలో చనిపోయాడు. కాబట్టి ఉగ్రవాదం అది ఏ రూపంలో వున్నా కూకటి వేళ్లతో పెకలించాల్సిందే. దీంట్లో ఇంకో మాటకు తావులేదు. అయితే ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే ముందు ఆ ఉగ్రవాదాన్ని గుర్తించాలి. దాని మూలాలు ఏమిటో గ్రహించాలి. అప్పుడే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం సులువవుతుంది.
అంతేకానీ, 2001 సెప్టెంబరు 11 దాడుల అనంతరం అమెరికా ప్రకటించిన 'ఉగ్రవాదంపై యుద్ధం' ద్వారానో , మన దేశంలో బిజెపి వంటి అతివాద , మతవాద పార్టీలు కోరుతున్న పోటా వంటి కఠినాతి కఠిన చట్టాలను తేవడం ద్వారానో ఉగ్రవాదాన్ని అంతమొందించవచ్చనుకుంటే పొరపాటు. సెప్టెంబరు11 అనంతర పరిణామాలు కూడా ఈ విషయానే ధ్రువీకరిస్తున్నాయి. ఉగ్రవాదానికి అనేక పార్శ్వాలున్నాయి. డబ్ల్యుటిఓ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు నిబంధనల పేరుతో సాగుతున్న ఆర్థిక ఉగ్రవాదం కావచ్చు, గుజరాత్‌లో నరేంద్ర మోడీ మైనార్టీలపై సాగించిన నరమేధం కావచ్చు, ఇజ్రాయిలీ యూదు దురహంకారులు పాలస్తీనీయులపై సాగించే దురాగతాలు కావచ్చు. అందుకే ఉగ్రవాద స్వభావాన్ని ముందు గుర్తించాలి. అప్పుడే దానిని సమర్ధంగా ఎదుర్కోగలం.
2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌లో వరల్డు ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగి నేటికి ఎనిమిదేళ్ళవుతోంది. ఉగ్రవాదం పీచమణచేస్తానని బీరాలు పలికిన బుష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎప్పుడు ఏ రూపంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు వస్తుందోనని అమెరికన్లు భయపడే పరిస్థితి ఇప్పటికీ నెలకొని వుంది. ఆ భయంతోనే అమెరికాలో అడుగుపెట్టే విదేశీయుల ప్రోటోకాల్ నిబంధనలను సైతం బేఖాతరు చేస్తూ అణువణువునా సోదా చేస్తున్నారు.9/11 గురించి అదే పనిగా ప్రస్తావించే అమెరికా గతంలో చిలీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇదే తారీఖున సైనిక కుట్రద్వారా కూల్చేసి, అధ్యక్షుడు అలెండీని హత్యచేయించిన విషయాన్ని మరచిపొమ్మంటున్నది. సోవియట్ పతనానంతరం ఆఫ్ఘన్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించే పేరుతో అధ్యక్షుడు నజీబుల్లాను ఎలా చంపించిందీ మరుగుపరుస్తున్నది.
ఇరాక్ వద్ద సామూహిక మారణాయుధాలున్నాయన్న సాకుతో ఆ దేశంపై దురాక్రమణపూరిత దాడికి పాల్పడి సద్దాం హుస్సేన్‌ను పట్టుకుని ఉరితీసిందీ, అల్‌ఖైదా నాయకుడు ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చారనే నెపంతో ఆఫ్ఘనిస్తాన్‌పై బాంబుల వర్షం కురిపించి పెద్దయెత్తున మారణ హోమం ఎలా సృష్టించిందీ కప్పిపుచ్చాలని చూస్తున్నది.ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో 2001- 2008 మధ్య కాలంలో గ్వాంటెనామో, బాగ్దాద్ శివార్లలోని అబూ గ్రాయిబ్‌లో ఖైదీలను చిత్ర హింసలు పెట్టింది. 2004లో 'న్యూయార్కర్' అనే పత్రిక ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రచురించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది.
ఖైదీల బట్టలూడదీసి ఒకరిపై ఒకరిని గుట్టగా పడదోసి హింసించడం, బూటుకాళ్లతో తన్నడం, పోలీసు జాగిలాలను ఉసికొల్పడం, ఇరుకైన బోనులో 24 గంటలూ నిల్చొండబెట్టడం, వారాల తరబడి నిద్రలేకుండా ఖైదీలపై నీళ్ళు ఘడియ ఘడియకు కుమ్మరిస్తుండడం, గడ్డకట్టే నీటిలో గంటల తరబడి ఉంచడం, పురుష ఖైదీలను నగంగా మహిళా ఖైదీల ముందు తిప్పడం, కాళ్లను, చేతులను గొలుసులతో బంధించడం, తిండి పెట్టకుండా మాడ్చడం, టాయిలెట్లు కల్పించకపోవడం వంటి చట్ట విరుద్ధ చర్యలతో చిత్రహింసలు పెట్టారు. కొందరిని నేర నిర్ధారణ కాక ముందే ఇంటరాగేషన్ సమయంలో చంపేశారు. ఉగ్రవాదులన్న అనుమానంతో 800 మందిని నిర్బంధించి అమెరికన్ నావికాస్థావరం గ్వాంటెనామోలో విచారణ సందర్భంగా ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరించింది.
అమెరికన్ మిలిటరీ కమిషన్ జరిపిన విచారణలో ఈ 800 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే దోషులుగా తేలారు. మిగతావాళ్లంతా అమాయకులేనని నిర్ధారణ అయింది. 525 మందిపై అసలు ఎలాంటి అభియోగాలు మోపకుండానే నెలలు, ఏళ్ల తరబడి నిర్బంధించారు. దాదాపు 20 లక్షల మందిని ఈ విధంగా వివిధ జైళ్లలో గతంలోని బుష్ ప్రభుత్వం కుక్కింది. దీంతో నేడు ప్రపంచంలోనే అతి పెద్ద బందిఖానాగా అమెరికా తయారైంది. సిఐఏ అనుసరించిన అత్యంతహేయమైన విచారణ పద్ధతులకు బుష్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఆ చట్టబద్ధతను రద్దు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అమెరికన్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బిఐ) చీఫ్ రాబర్టు ముల్లర్ హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. అయినా డిక్ చెనీ వంటి వారు సిఐఎ అధికారులకు బాహాటంగానే సమర్ధించుకొచ్చారు.
అలా అని అమెరికా 9/11 ఘటనల తరువాతే ఖైదీలను ఈ విధమైన వేధింపులు, చిత్రహింసలకు గురి చేశారని, అంతకుముందు ఇలాంటివి లేవనుకుంటే పొరపాటు. సెప్టెంబరు11 దాడులకు ముందు కూడా ఖైదీలను చిత్రహింసలు పెట్టే శిబిరాలను అమెరికా సాగించింది.
బుష్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన కండోలిజా రైస్ అధికారం పోయిన తరువాత 'ఉగ్రవాదంపై యుద్ధం' ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఇది మా సమిష్టి వైఫల్యం అని సన్నాయి నొక్కులు నొక్కారు. గతంలో జరిగిన వాటిని మరచిపొమ్మంటున్నారు. అంతేగానీ, గతం నుంచి గుణపాఠాలు తీసుకోవడానికి ఆమె సుముఖంగా లేరు. బుష్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఒబామా తాను అధికారంలోకి వస్తే అబూగ్రాయిబ్, గ్వాంటెనామాలను మూసివేస్తానని, ఇరాక్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుంటామని హామీలు గుప్పించారు.
ఆయన మాటలను విశ్వసించిన అమెరికన్లు ఆయనకు అఖండ విజయం చేకూర్చారు. అధికారంలోకి వచ్చాక అబూగ్రాయిబ్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇంటరాగేషన్ పేరుతో అమాయకులను చిత్ర హింసలు పెట్టిన అధికారులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 'ఉగ్రవాదంపై యుద్ధం' అన్న పదజాలాన్ని ఉపయోగించొద్దని వైట్ హౌస్ సిబ్బందికి సూచించారు. ఇలాంటి అరకొర చర్యలు మినహా విధానాల్లో మౌలిక మార్పులు తేవడంలో ఒబామా ఇప్పటికీ ఊగిసలాట ధోరణినే ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి కంటి తుడుపు చర్యలతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేరు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే తన విధానాలను అమెరికా విడనాడాలి. ఉగ్రవాదం, మానవ హక్కుల పట్ల ద్వంద్వ ప్రమాణాలకు స్వస్తి చెప్పాలి. గతం కన్నాతాను విభిన్నమైన మార్గంలో నడుస్తున్నానని మాటల్లో కాక చేతల్లో చూపాలి.

1 కామెంట్‌లు:
ఉగ్రవాదం పై మీ వ్యాసం చాలా బాగుంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి