వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



1, సెప్టెంబర్ 2009, మంగళవారం

నెత్తుటితో తడిసిన చరిత్ర పుటలు


వినాశనం సృష్టించిన మహా యుద్ధాలు
నెత్తుటితో తడిసిన చరిత్ర పుటలు
సంగ్రామాలతో మానవాళికి సంక్షోభం
ప్రపంచ వినాశనానికి హేతువైన రెండో ప్రపంచ యుద్ధం మొదలై నేటికి సరిగ్గా 70 ఏళ్ళు.
1939 సెప్టెంబర్‌ 1వ తేదీన ఈ యుద్ధం ప్రారంభమై 1945 సెప్టెంబర్‌ 2వ తేదీన ముగిసింది .

సృష్టి ఆవిర్భావం నుంచి మనుషుల మధ్య కక్షలు, కార్పణ్యాలు, సామ్రాజ్య పిపాసలే మనిషి వినాశనానికి హేతువులవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సంగ్రామాలుగా ఇప్పటికీ కురుక్షేత్ర, రెండో ప్రపంచ యుద్ధాలు గుర్తింపు పొందాయి. ఇవి మిగిల్చిన నష్టం అపారం. కొన్ని తరాల వరకు మానవజాతి ఈ నష్టాల నుంచి తేరుకోలేకపోయింది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం 1939 సెప్టెంబర్‌ 1వ తేదీన అప్పటి జర్మన్‌ నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రోత్సాహంతో జరిగిన బాంబు దాడి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. మొత్తం ప్రపంచదేశాలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయాయి.
ఈ యుద్ధం దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ఆరేళ్ళ పాటు సుదీర్ఘంగా సాగింది. 1945 సెప్టెంబర్‌ 2వ తేదీన ముగిసింది. ఈ యుద్ధం నేర్పిన పాఠాలను ఇప్పటికీ మానవజాతి మర్చిపోలేదు. తొలిసారిగా అణు విస్ఫోటనాన్ని ఈ యుద్ధమే ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ యుద్ధం కారణంగా జపాన్‌ తీవ్రంగా
నష్టపోయింది. ఇక ముందు ఇంతటి ఘోర విపత్తును ప్రపంచం తట్టుకోలేదన్న భయంతో ప్రపంచదేశాలన్నీ ఒకే వేదికపైకొచ్చాయి. శాంతిని పరిరక్షించుకోవాలని నిర్ణయించాయి. ఈ యుద్ధంలో పదికోట్ల మంది సైనికులు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఏడుకోట్ల మంది సాధారణ పౌరులు మృతిచెందినట్లు అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు కలసి జర్మనీ, పోలెండ్‌లపై యుద్ధం ప్రకటించాయి. అప్పటికే చైనా, జపాన్‌ల మధ్య యుద్ధం సాగుతోంది. సోవియట్‌ యూనియన్‌లోని బార్బరోసా, అమెరికాలోని పెర్ల్‌హార్బర్‌లతో పాటు బ్రిటీష్‌, డచ్‌ కాలనీలపై జర్మనీ, జపాన్‌ల సంయుక్తదాడులు సాగాయి. యఈ యుద్ధంలో ఎల్లీస్‌, యాక్సెస్‌ గ్రూపులుగా ప్రపంచ దేశాలు విడిపోయాయి. ఈ యుద్ధ పరిణామంతోనే యునైటెడ్‌ స్టేట్స్‌, సోవియట్‌ యూనియన్లు ప్రపంచంలో సూపర్‌పవర్స్‌గా ఆవిర్భవించాయి.
అప్పటికీ ఇప్పటికీ మనుష్యుల్లోని ఉద్రేకం, కార్పణ్యం, కక్ష, సామ్రాజ్య కాంక్షలు మారలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో రెండేరెండు అణుబాంబులను వినియోగించారు. కురుక్షేత్రంలో ఒకే ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. కాగా ప్రస్తుతం వీటికంటే కొన్ని లక్షలరెట్లు శక్తిగల హైడ్రోజన్‌ బాంబులు, జీవరసాయన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అమెరికా వంటి అగ్రరాజ్యంతో పాటు ఉత్తర కొరియా వంటి చిన్న చిన్న రాజ్యాలు కూడా వీటిని తమ అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. మరోసారి యుద్ధమంటూ వస్తే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాలు కూడా మిగలవు. మొత్తం ప్రపంచంలోని జీవజాలమంతా తుడిచిపెట్టుకుపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా స్వయం నియంత్రణ అన్ని దేశాలకు అవసరం.
కురుక్షేత్ర యుద్ధం వివరాలు
యుద్ధం జరిగిన కాలం క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరం
యుద్ధం సాగిన రోజులు 18 రోజులు
ప్రదేశం - కురుక్షేత్ర, హర్యానా, ఇండియా
ఫలితం -- పాండవుల విజయం
యుద్ధంలో గ్రూపులు.. పాండవులు, కౌరవులు
నాయకులు... పాండవులకు దృష్టద్యుమ్నుడు, కౌరవులకు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ
బలాబలాలు.... పాండవులకు ఏడు అక్షౌహిణులు అంటే 15,30,900 మంది
కౌరవులకు 11 అక్షౌహిణులు అంటే 24,05,700 మంది
మృతులు-పాండవుల తరఫున పోరాడిన మొత్తం వీరులు, సైనికుల్లో కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. అయిదుగురు పాండవులతోపాటు కృష్ణుడు, సాత్యకి, యూయుత్సుడులే మిగిలారు.
కౌరవుల తరఫున... పోరాడిన వీరులు, సైనికుల్లో కేవలం ముగ్గురు మాత్రమే యుద్ధంలో బతికి బయటపడ్డారు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలే మిగిలారు.
రెండో ప్రపంచయుద్ధ విశేషాలు
ప్రారంభం 1939 సెప్టెంబర్‌ 1
ముగింపు 1945 సెప్టెంబర్‌ 2
యుద్ధం జరిగిన ప్రదేశం... యూరోప్‌, ఫసిఫిక్‌, అట్లాంటిక్‌, సౌత్‌ఈస్ట్‌ ఆసియా, చైనా, మిడిల్‌ఈస్ట్‌, ఆఫ్రికా
ఫలితం- ఎల్లీస్‌ గ్రూప్‌ విజయం
యునైటెడ్‌ నేషన్స్‌, సోవియట్‌ యూనియన్లు సూపర్‌పవర్స్‌గా ఆవిర్భావం నాటో ఆవిర్భావం
యూరోప్‌లో కోల్డ్‌వార్‌ ప్రారంభం
యుఎస్‌, సోవియట్‌ల మధ్య కోల్డ్‌వార్‌కు శ్రీకారం
ఎల్లీస్‌గ్రూప్‌లోని దేశాలు.. ఆస్ట్రేలియా, అల్బేనియా, బెల్జియం, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఇండియా, లగ్జంబర్గ్‌, మెక్సికో, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, నార్వే, ఫిలిప్పీన్స్‌, పోలెండ్‌, సౌతాఫ్రికా, యుగోస్లేవియా, బ్రిటీష్‌ సామ్రాజ్యం, సోవియట్‌, అమెరికా,
అప్పటికే యుఎస్‌, సోవియట్‌, బ్రిటీష్‌ సామ్రాజ్యాలు ప్రపంచంలో అతిపెద్ద మూడు శక్తులుగా గుర్తింపు పొందాయి. ఈ యుద్ధ కాలంలో చైనాను నాలుగో అతిపెద్ద శక్తిగా గుర్తించారు. తర్వాత పోలెండ్‌ కూడా ప్రధాన సైనిక శక్తిగా ఆవిర్భవించింది.
యాక్సెస్‌ గ్రూప్‌లోని దేశాలు.. జర్మనీ, ఇటలీ, జపాన్‌, హంగేరి, రుమేనియా, బల్గేరియా, శాన్‌మేరినో, ఫిన్‌ల్యాండ్‌, ఇరాక్‌, ధాయిలాండ్‌, క్రోయేషియా, గ్రీస్‌
మృతులు - ఎల్లీస్‌ దేశాల తరపున సైనికులు.. 1 కోటీ 60 లక్షలు
సాధారణ ప్రజలు 4 కోట్ల 50 లక్షల మంది
మొత్తం 6 కోట్ల 10 లక్షల మంది
యాక్సెస్‌ దేశాలు తరఫున మృతులు
సైనికులు 80 లక్షల మంది
సాధారణ ప్రజలు 40 లక్షల మంది
మొత్తం 1 కోటి 20 లక్షల మంది

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి