
భౌతికంగా బ్రూనో బూడిదయ్యా డు. కానీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సత్యాన్వేషణుల గుండెల్లో చిరస్థా యిగా నిలిచిపోయాడు. అందుకే రోమ్‌లో ఆయనను శిక్షించినచోట నిర్మించిన స్మారకచిహ్నంపై 'ఈయన ప్రజలందరి కోసం, ఆలోచనా స్వేచ్ఛ కోసం ఎలుగెత్తి నినదించాడు. దీనికోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు' అని రాసి ఉంది. విజ్ఞానశాస్త్రంపై చర్చి దాడి బ్రూనోతోనే ఆగలేదు. మరో శాస్త్రవేత్త గెలీలియో కూడా బలయ్యాడు.
గెలీలియో
ఈయన ఇటలీలో 1564లో జన్మించాడు. అనేక పరికరాలను తయారుచేశాడు. వీటిలో టెలిస్కోపు ఒకటి. 1609లో దీన్ని రూపొందించాడు. అంటే సరిగ్గా 400 సంవత్సరాల క్రితం. అందుకే, 2009ని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటిం చింది. ఇంతకీ, టెలిస్కోపు గొప్పతనం ఏమిటి? దీనిద్వారా వస్తువులను అనేకరెట్లు పెద్దగా చూడవచ్చు. దీని సాయంతో గెలీలియో చంద్రు డిని, బృహస్పతి గ్రహాలను దాని నాలుగు ఉప గ్రహాలను, శుక్ర గ్రహాన్ని, సూర్యుడి మచ్చల్ని వివరంగా అధ్యయనం చేశాడు. అప్పటి వరకూ భూమి చుట్టూ సూర్యుడు తిరు గుతూ ఉంటాడని, విశ్వానికంతటికీ మధ్యలో భూమి ఉంటుందని మత గ్రంథాలు ప్రబోధించేవి. గెలీలియో టెలిస్కోపు పరీక్షల ద్వారా ఇది తప్పని స్వయంగా చూపించాడు. సహజంగా ఈ పరిశోధన ఫలితాలు క్రైస్తవ మతపెద్దలకు నచ్చలేదు. వారు అతనిని మందలించారు. అయినా, గెలీలియో చలించలేదు. పరిశోధన ఫలితాలను ఆయన గ్రంథస్తం చేశాడు. ఈ గ్రంథాలను చర్చి పెద్దలు నిషేధించారు. గెలీలియో భయపడకుండా తన సిద్ధాంతాన్ని ప్రచారం చేయసాగాడు. దీనిపై మతాధికా రులు మరింత రోషపడి, ఆయనను అనేక చిత్రహింసలకు గురిచేశారు. చివరకు, బలవంతంగా తన సిద్ధాంతాలు తప్పని ఒక పత్రాన్ని రాయించుకున్నారు. అయినా, ఇక ముందు కూడా తన పరిశోధనా ఫలితాలను ఎక్కడ ప్రచారం చేస్తాడోనని భయపడి ఆయనను గృహ నిర్బంధంలో పెట్టారు. చివరకు ఆ మహాశాస్త్రవేత్త 1642 జనవరి 8న గృహనిర్బంధంలోనే చనిపోయాడు. అన్నింటికన్నా దారుణం ఆయన పరిశోధనా వ్యాసాలను మతాధికారులు ఆయన మరణానంతరం తగలబెట్టారు. అయినా, విజ్ఞాన ప్రగతి ఆగిందా? ఆయన నిరూపించిన సిద్ధాంతం ఈనాటికీ అందరికీ ఆమోదయోగ్యమైంది. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి, ప్రపంచంమంతటా వెలుగులు నింపాలని, ప్రయత్నించిన ఒక మహానుభావుడిని మతాధికారుల మూర్ఖత్వం బలిగొంది. ఆయన కీర్తిని సూర్యమండలం మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి