వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



31, ఆగస్టు 2009, సోమవారం

ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలను కల్గిస్తున్న గ్లైఫోసేట్



గ్లైఫోసేట్‌ ఒక శక్తివంతమైన కలుపుమందు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మందు. ఇది అన్ని మొక్కలను చంపేస్తుంది. ఇది మార్కెట్‌లో గ్లైసిల్‌, రౌండప్‌, రూల్‌ అవుట్‌, క్లీన్‌అప్‌, వీడాల్‌, బ్రేక్‌, వీడాప్‌ లేదా ఎక్సల్‌మేరా అనే వ్యాపారనామాలతో దొరుకుతుంది. అందువల్ల, దీన్ని ఎప్పుడూ కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే తుంగ, గరిక, దర్బలాంటి మొండి కలుపు నియంత్రణకు మాత్రమే వాడాలని మనదేశ నిపుణులు సూచిస్తున్నారు. దీనికి విరుద్ధంగా మోన్‌శాంటో కంపెనీ జన్యుమార్పిడి ప్రక్రియల ద్వారా ఈ మందును తట్టుకునే కొన్నిరకాల్ని రూపొందించింది. గ్లైఫోసేట్‌ మందును ఈ రకాలతో వాడమని చెబుతోంది. మనదేశంలో దీన్ని ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌నే ప్రయోగశాలగా ఎన్నుకుంది. అనధికారికంగా ఈ మందును తట్టుకునే మొక్కజొన్నరకాన్ని 'రౌండప్‌రెడీ' పేరుతో దాదాపు 20 వేల ఎకరాల్లో ఈ సంవత్సరం వేయించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ గ్లైఫోసేట్‌ ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలను కలిగిస్తుందని, దీన్ని నిషేధించాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. గత రెండు శతాబ్దాలుగా దీని విష ప్రభావంపై సాక్ష్యాలు బయటపడుతున్నాయి.
1. మనుషుల్లో హార్మోన్ల పనివిధానాన్ని విచ్ఛిన్నం చేస్తుందని డాక్టర్‌ మే వాన్‌ హో అనే శాస్త్రజ్ఞుడు ఒక నివేదికను రూపొందించి, అమెరికా పర్యావరణ సంస్థకు సమర్పించాడు.
2. 'బొడ్డు పేగు' కణాలను ఇది చంపేస్తుందని, రౌండప్‌ (మోన్‌శాంటో కంపెనీ గ్లైఫోసేట్‌)తో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరీక్షల్లో కనుగొన్నారు.
3. గర్భస్రావాలకు కారకంగా దీన్ని గుర్తించారు.
4. కప్పలాంటి జంతువుల్ని ఇది చంపేస్తుంది.
5. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన గైస్‌ ఎరిక్స్‌ సెరాలిన్‌ అనే శాస్త్రవేత్త మనిషి శరీరంలోని కణాలను ఇది అతితక్కువ పరిమాణంలోనే (కొన్ని పిపిఎంలలో) చంపగలదని నిరూపించాడు. ఇది కలుపు నియంత్రణ కోసం మామూలుగా వాడే పరిమాణం కన్నా చాలా తక్కువ.
6. ఈ మందు బయట పొర (కవచం)లో గల కణాలను, జీవరసాయన ప్రక్రియలను విషతుల్యం చేస్తుందని, డిఎన్‌ఎ కణాలను విచ్ఛిన్నం చేస్తుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
7. అతి తక్కువ మోతాదులో సెక్స్‌ హార్మోన్ల తయారీని ఈ మందు ఆటంకపరుస్తుందని, తద్వారా జీవప్రక్రియలపై దుష్ప్రభావం కలిగి ఉందని శాస్త్రజ్ఞులు నిరూపించారు. స్పర్మ్‌ ఉత్పత్తి, గర్భం దాల్చటాన్ని గ్లైఫోసేట్‌ ఆటంక పరుస్తుంది. కణ నిర్మాణంలో మార్పులను (మ్యూటేషన్‌) తీసుకువస్తుందని, పర్యావరణ సమస్యలను సృష్టిస్తుందని, భారీ లోహాల (హెవీ మెటల్‌) విషతుల్యాన్ని పెంచుతోందని పరిశోధనల్లో గుర్తించారు.
ఈ నేపథ్యంలో, గ్లైఫోసేట్‌ ఉత్పత్తి, వాడకాన్ని నిషేధించాలని డాక్టర్‌ మే వాన్‌ హో అమెరికా ప్రభుత్వాన్ని కోరాడు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది.







0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి