వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



25, డిసెంబర్ 2010, శనివారం

హిందువులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే క్రిష్టియన్లు స్వీకరిస్తారా ?

హిందువులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే క్రిష్టియన్లు స్వీకరిస్తారా అని చిలమకూరు విజయమోహన్ తన లీలా మోహనం లో అన్న దానికి జవాబుగా వ్రాయడం జరిగింది ఈ టపా.
http://vijayamohan59.blogspot.com/2010/12/blog-post_25.html
సమాదానము మీరే మీ టపాలో వ్రాసారు " మేము చిన్నప్పుడు నంద్యాలలో ఉన్నప్పుడు మేము బాడుగకు ఉన్నది క్రిష్టియన్ల ఇంటిలోనే.మా ప్రక్క ఇంటిలో కూడా రేడియాలజిస్టయిన ఓ క్రిష్టియన్ కుటుంబముండేది.వాళ్ళు మాతో చాలా చక్కగా కలిసిపోయి ఒకే కుటుంబ సభ్యుల్లా మెలిగేవారు.హిందూ పర్వదినాలప్పుడు మేమిచ్చే ఆహారాన్ని,ప్రసాదాన్ని ఆనందంతో నిరభ్యంతరంగా తీసుకునేవారు.అలాగే వారి పండుగలప్పుడు కూడా వారిచ్చేవాటిని మేమూ అలాగే తీసుకునేవారం."

తప్పకుండ స్వీకరిస్తారు.ఎవరు స్వీకరిస్తారంటే బైబుల్ ను చదివి దాని ప్రకారం నడవటానికి ప్రయత్నిన్చేవాళ్ళు మాత్రమే అలా చేస్తారు.కొందరి తప్పుడు బోధనలవల్ల చాలా మంది క్రైస్తవులు అలా చేస్తున్నారే తప్ప నిజంగా క్రైస్తవ్యం గురించి తెలిసినవాళ్లు అలా చేయరు.యేసు జీవించి ఉన్నపుడు కూడా విగ్రహారాధన ఉండేది .కాని విగ్రహారాదన గురించి ఒక్క మాటైన కూడా యేసు అనలేదే.మరి అలాగే యేసు తరువాత పౌలు అనే శిష్యుడు విగ్రహాలకు అర్పించినవాటిని తినవచ్చును అని చెప్పాడు కదా. కాని ఇప్పటి బోధకుల భోదనల వల్ల క్రైస్తవ్యనికి చెడ్డపేరు వస్తుంది .బైబిల్ లో చెప్పబడినట్టు క్రైస్త్యవం అనేది మతమే కాదు .క్రీస్తు ని అనుసరించు వాడు క్రైతవ్యుడు అనబడును అని బైబుల్ లో ఉంది అనుసరించుట అంటే ఆయన చెప్పిన వాటిని చేసే వాడు అని .ఉదా : "నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని " , "ఒక చెంప పై కొడితే ఇకొక చెంప చూపెట్టమని " అలా చేసిన వాడే క్రైస్తవుడు అని .ఇలా చెప్పుకుంటూ పోతే బైబుల్ లో చాల ఉన్నాయి.దేవుడు సృష్టించినదేది అపవిత్రము కాదు అని బైబుల్ లో స్పష్టంగా వ్రాయబడినది .బైబుల్ లో ఉన్నది ఉన్నటుగా చెప్పకుండా వక్రీకరించి భోదకులు చెప్పడము వల్ల ఈ విధంగా జరుగుతుంది.

కొన్ని తెలిసినా కూడా చాల మంది మరడంలేదు . చాలా మంది నిమ్న కులాలవారినీ (SC /ST ) లను ఇప్పటికి మన దేవాలయల్లోకి అనుమతిన్చడము లేదు.నిజంగా ఇదిఎంతవరకు సమంజసము ?

అంటే మనుషులను చేసిన దేవుడిదే తప్పు అన్నమాట .ఎందుకంటే వారిని చేసింది కూడా ఆ దేవుడే గా!! బైబుల్ లో ఒక మాట వ్రాయబడింది "కనిపించే నీ సహోదరున్ని ,సహోదరిని ప్రేమించని వాడివి కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని?

అందుకే మతము కంటే మానవత్వం గొప్పది

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి