ఎవరయినా తెలంగాణా లో తిరగొచ్చు నిరబ్యంతరంగా, కాకపొతే తెలంగాణా దొరకు కప్పం కట్టాకే!!
దొరా "నీ కాల్మొక్కుతా" గాళ్లు ఉన్న తెలంగాణాలో, వాళ్ల దొరకు కప్పం కట్టక పొతే, కాల్మొక్కుతా గాళ్లకు కోపం రాదంటారా? ఆయ్ కాల్మొక్కుతా చరిత్రను అవహేళన చేస్తారా?
మీరు శ్రిచైతన్య అయినా, నారాయణా అయినా ఎమీ అనము, కాకపోతే మాకు కప్పం కట్టాకే, మీరు మీ సినేమాలు ఎలా తీసినా, ఏమి తీసినా ఎమి అనము మా దొర కూతురుకు కప్పం కడితే, మీ లారీలు ఇసకను ఎంత తెచ్చినా ఏమీ అనము, కాక్పోతే
మా దొర అల్లుడు కు కప్పం కడితే!!
జిందా బాద్ దొర, జిందాబాద్ "నీ బాంచెన్" సంస్కృతి.
తెలంగాణా వెనుకభాటుతనం లో అజ్ఞాత చెప్పినదీ కూడ ఒక కారణం .తెలంగాణలో ఉన్న చాలా మంది రాజకీయనాయకులు దొరలేనండి .దొరల తరం పోనంత వరకు అభివృద్ధి రాదండి. ఎందుకంటే ప్రత్యక్షముగా అనుభవిస్తున్నాము కాబట్టి .
తెలంగాణా దేశం లో భారతీయుల పర్యటలను అడ్డుకోవాలి, ఎందుకంటే ఇది మాగడ్డ , ఇక్కడ వీచే గాలి మాది, ఇక్కడ పారే నీరు మాది .ఇల్లాంటి మా గడ్డపైకి మీ భారతీయులు ఎలావస్తారు ?
"తెలంగాణాకు అడ్డొస్తే అడ్డంగా నరుకుతాం "
అనేది ఒక్కపట్టిమాట ,మరి ఇప్పుడు
"తెలంగాణాకు వస్తే అడ్డంగా నరుకుతాం"
మా కెసిఆర్ చెప్పలేదా? ఏమి జరుగుతుందో!
మా సహనాన్ని పరిక్షించవద్దు.
ఇవి కొన్ని మాత్రమే.నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
మొదట నేను భారతీయుడిని తర్వాతనే మిగిలనది .రాను రాను మన భారతదేశములో భారతీయునికి స్వేఛ్చ ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే ?
ఒక భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలి , కాని తోటి భారతీయుడు తలదించుకోవలసిన పరిస్థితి నేడు రావడము విచారకరము.
ముంబైలో ఇతరాప్రాంతల వారు ఉద్యోగాలు చేయరాదు ,RBI లాంటి పరిక్షలు వ్రాయకూడదు, కనీసము taxi నడపరాదు.
అలాంటి రోగ లక్షణాలే మన ఆంధ్రప్రదేశ్ కి రావడం చిగ్గు చేటు .
భారతదేశము లో పుట్టిన ప్రతి వ్యక్తీ ఎక్కడైనా జీవించవచ్చు , భారతదేశములో ఎక్కడైనా పర్యటించవచ్చు .అంతే కాని ప్రతి రాష్ట్రానికి అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్తితి ఈ రోజు రావడం భాదాకరం .
తెలంగాణా, సమైక్య ఉద్యమాలు ఎలా ఉన్నా , నిజంగా
- ఒక ప్రాంతం ప్రజలు కాని ,ప్రజాప్రతినిదులు కాని ,రాజకీయ పార్టీలు కాని ఇతరా ప్రాంతాలలో పర్యటించ కూడదా ?
- తమ సిద్దాంతాలను కాని , తమ భావాలను కాని ,ఇతరా ప్రాంతాలలో వ్యక్తపరచాకూడదా?
- మీ ప్రాంతములో పర్యటిస్తున్న ఇతరా ప్రాంత నాయకుల ,ప్రజల సిద్దంతాలు కాని , మనోభావాలు కాని నచ్చక పొతే వాటిని నిరసించడంలో తప్పు లేదు .కాని దాడులు చేస్తాం , అడ్డంగా నరుకుతాం లాంటివి తప్పు కాదా?
- ఇది ఏ ప్రాంతము వారైన స్పందించాల్సిన విషయము కాదా ?
- కెసిఆర్ సమైక్య ఆంధ్రలో పర్యటించి తెలంగాణా ఎందుకు ఇవ్వాలో అనే విషయాన్ని వివరించకూదదా ?
- జగన్ కానీ చిరంజీవి కానీ ఇతరా నాయకులు కానీ తెలంగాణలో పర్యటించకూడదా ? వాళ్ళ భావాలను వ్యక్తీకరించే హక్కు లేదా ?
కెసిఆర్ కాని జగన్ కాని చిరంజీవి కాని ప్రజల స్పందన లేకుంటే ఎంతవరకు పర్యటించగలరు!
2 కామెంట్లు:
Brother..what you have said is True. But Truth is not required in the world today. What is required is the ability to influence, the platform to shout from. Only the rich can do the these things
you have correctly written.well done.
కామెంట్‌ను పోస్ట్ చేయండి