వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



17, నవంబర్ 2009, మంగళవారం

భారత మాత నీవైనా చెప్పమ్మా !!

అనగనగా ఒక అమ్మ .ఆ అమ్మకు 28 కుమారులు. కొందరు నల్లగా ఉన్నారు ,కొందరు తెల్లగా ఉన్నారు,కొందరు పొడవు ,కొందరు పొట్టి ,కొందరు బలవంతులు ,కొందరు బలహీనులు.అందరు కలసికట్టు గా ,స్నేహంగా ,ప్రేమగా ఉన్నారు .వీళ్ళను చూసి తల్లి చాలా సంతోషించింది.ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.
ఇంతలో కొందరిలో అసూయ ,ద్యేశాలుపెరిగాయి .బలవంతులు బలహీనులను ,పోడుగువారు పోట్టివారిని ,తెల్లవారు నల్లవారిని భాదించడము ప్రారంబించారు.బలవంతుడిలో మంచివాడైన ఒక వ్యక్తి తోటి బలవంతులతో "మనమందరమూ ఒకే అమ్మ కుమారులము ,అందరూ సమానమే నేను బలవంతుని గా కంటే అమ్మ కొడుకుగానే ఇష్టపడుతాను " అని అన్నాడు . అంతే మిగతా బలవంతులకు కోపం వచ్చింది .నీవు అమ్మ కొడుకువని ఒప్పు కుంటే మా బలవంతులకు ద్రోహం చేసిన వాడివి అవుతావు అని బెదిరిచారు.ఇదంతా చూస్తున్న అమ్మ కన్నీరు కార్చింది ఏమి చేయ లేక ,ఏమి చెప్పలేక .........

ఇదండీ నేటి భారతదేశ పరిస్తితి .భారత రాజ్యాంగము ప్రకారము భారత దేశములో పుట్టి ,పెరిగిన ప్రతి ఒక్కరు భారతీయులే .ఇందులోని ప్రతి ఒక్కరు భారత మాత పాలు తాగడానికి అర్హులే .తాగొద్దు అని చెప్పే హక్కు గాని అధికారము గాని ఏ ఒక్కరికి లేదు .ఇది భాగా గుర్తించుకోవలసిన విషయము .
ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ అన్న విషయాన్ని ఒక సారి చూడండి
"మరాఠి అయినందుకు గర్విస్తున్నాను .కాని అంతకన్నా ముందు నేను భారతీయుడను .ముంబాయి భారతీయు లందరిది ".
ఇందులో ఎటువంటి తప్పు కనిపించుటలేదు . అయినాను తన రాజకీయ ఉనికి కోసం భాల్ థాకరే అనే బలవంతుడు ( ఈయన కు ప్రపంచ వ్యాప్తంగా పేరుందో లేదో ఆయనకే..........తెలియాలి ) "క్రీజ్ వదలి రాజకీయ పిచ్ పై ప్రవేశిస్తున్నావు " అని బెదిరించడము ఎంతవరకు సమంజసము .రాజకీయము అంటే వాడబ్బ సొమ్ము అని అనుకున్నాడో ఏమో .భాల్ థాకరే కు ప్రతేకమైన హక్కు ఉందా ? "105 మంది మరాఠి ప్రజలు ప్రాణాలు అర్పించి ముంబాయి సాదించారు" అన్న
ఈ వాఖ్య నాకు ఎంతగానో నచ్చింది .ముంబాయి భారత దేశములో ఒక భాగము .అంటే వాళ్లు భారత దేశము కొరకు ప్రాణాలు అర్పించారు అన్నమాట .అయినా ప్రాణాలు తీసేవాడికి ప్రాణాలు అర్పించిన వారి త్యాగనిరతి అర్థమైతేగా.
భారత మాత నీవైనా చెప్పమ్మా !!
భారత మాత నీవైనా ఒకసారి చెప్పమ్మా !!

ఈ మద్య కాలములో ఈ విషసంస్కృతి చాలా మందికి వచ్చింది .రాజకీయంగా తమకు స్థానము లేనప్పుడు ,రాజకీయంగా వెనుకపడినప్పుడు , ప్రాంతీయ అసమానతలు సృష్టించి ,కుటిల రాజకీయముతో అన్నదమ్ముల మద్య చిచ్చుపెట్టే ఈ రాజకీయ నాయకులను ఏమి చేయాలి ? నిస్పక్షిపాతంగా , ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు లోను చేయకుండా ,ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే గెలిచే నాయకులు ఎంతమంది ?గెలిచే రాజకీయ పార్టీలు ఎన్ని?
ఇక మన రాష్ట్రములోని భాల్ థాకరే గురించి చెప్పనక్కరలేదు .ప్రాంతాలుగా విబేదాలు సృష్టించి అన్నదముల మద్య ఆజ్యం పోస్తున్న ఈ నాయకుడు ,తనకు రాజకీయంగా స్థానం లేకపోవదముతో ,అప్పటివరకు గుర్తుకు రాకపోయినా వెనుకబాటు తన్నాన్ని ,బుజాలకేత్తు కొని ఒక పార్టీ స్తాపించి పదవులను అనుభవించి అన్ని పోయాక "రామా నీవే గతి "అన్నవిధంగా "అమరజీవి పొట్టి శ్రీరాములు " చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇప్పటికి గుర్తుకొచింది .ఇప్పటికైనా గుర్తుకు వచ్చినందుకు సంతోషము . బలి పీఠం ఎక్కుతాడో , బరి తెగించి పరిగెడతాడో చూద్దాం ?
ప్రత్యేక తెలంగాణాకు ఏ ఒక్క తెలుగు ప్రజలు వ్యతిరేకం కాదు (రాజకీయ నాయకులు తప్ప) .అయితే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలను తీసుకోవాలి .అందరిని ఒప్పించి సంతోషంగా బయటికి వెళ్లి పోవచ్చును .అంతే కానీ ఇంటిని (రాష్ట్రాన్ని) రావణ కాస్టంగా మార్చడము మంచిది కాదు .కాబట్టి ముందుగా రాష్ట్ర మంత తిరిగి అందరిని ఒప్పించి (రాజకీయనాయకులను కాదు ప్రజలను ),ప్రజలు ఒప్పుకుంటే ప్రతేకంగా వెల్లడము మంచిదే .అయినా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేయడానికే వెనుకంజ వేసిన నీవు ఇక రాష్ట్ర మంట ఎక్కడ తిరుగు తావులే . నిజంగా ప్రజాస్వామ్యం పై , ప్రజల పై నమ్మకము ఉంటే రాష్ట్ర మంతటా పోటి చేసి ,గెలిచి ప్రత్యేక తెలంగాణను తే అన్నా!
నా కళల సౌదాన్ని నిర్మించు .............................
అన్న చంద్ర శేఖర రావు గారు చేసే ఈ బలి యాగము విజయవంతము అవ్వాలని ,అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సరసన నిలవాలని ఆశిద్దాము .

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

chasthe peeda vaduluthundi ...

asalu samasyalani vadilesi ilanti kodiguddu meeda eekalu peeke vedhavalani kaalcheyali

Prem చెప్పారు...

Balthakre pai matter nachindi kaani... KCR pai nacha ledu... vaalliddariki polike ledu... iddaru anna tammula madya godava teerchataani ke years ki years padutavi... rashtram motham oppinchaalata.. nuvvu aa pani chey... vidi povaddu ani rashtram motham tirigi pracharam chey.... prajallo chaitanyam raavvaali... panulu cheppi cheyinchukovaali..kaanee.. vaallu samasyalani vadilesaaru.. ani kaalcheyatam enti.??

నిజం చెప్పారు...

చాల బాగ చెప్పారండి.....సచిన్ ఈండియ కి చెందినవాడు.....

రచన చెప్పారు...

ప్రేమ్ గారు,
"నిజంగా ప్రజాస్వామ్యం పై , ప్రజల పై నమ్మకము ఉంటే రాష్ట్ర మంతటా పోటి చేసి ,గెలిచి ప్రత్యేక తెలంగాణను తే అన్నా!"
అనే ఈ వాఖ్యను మీరు మరచిపోయినారు అనుకుంటాను.
నేను చంద్రశేఖర రావు గారిని బాల్ థాకరే తో పోల్చడము సమంజసమే.హైదరాబాద్ ఎవరబ్బా సొత్తు కాదు దానిని వదలి వెళ్ళమనే హక్కు ఎవ్వరికీ లేదు.అలాగంటే కర్నూలు వాళ్ళు రాష్ట్ర రాజధానిని వదులుకోవడము లో అర్థము లేదనేగా .అన్ని ప్రాంతాల వారు కలసి అభివృద్ధి చేస్తేనే నాటి హైదరాబాద్ నేటి హైటెక్ సిటీగా మారినది .హైదరాబాదు కూడా భారత దేశములో ఒక భాగము మాత్రమె.ఎవరైనా ఏప్రాంతం వాడైనా హైదరాబాద్ లో ఉండవచ్చును.

అజ్ఞాత చెప్పారు...

బాబ్లి విషయములో మన రాజకీయ నాయకులకు కావలసింది రాజకీయము తప్ప ఇంకా ఏమి లేదు. ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణం లో చూస్తారు తప్ప ,ప్రజలకు నష్టం కలిగిస్తుందన్న భాద కానీ ఏ ఒక్క పార్టికి లేదు.బాబ్లి విషయములో ఒక మాజీ ముఖ్యమంత్రికి జరిగిన దానికి ప్రతి ఒక్క తెలుగు వాడు తల వంచుకోవాలి ????

కామెంట్‌ను పోస్ట్ చేయండి