ఈ విశ్వం అనంతమైనది .అనంతమైన ఈ విశ్వంలో భూమి చాలా చిన్నది .అలాంటి భూమిపై ఉన్నమనము ఇంకా చిన్నవాల్లము కామా? ఈ భూమిపై ఉన్నచీమలకూ ఒక ప్రపంచము ఉంది .అందులో రాజు,రాణి చీమలూ ,శ్రామిక చీమలూ ఉన్నాయి అని చదువుకున్నాము కదా .అలాంటి చీమలకు మానవుని గురించి తెలసునా? చీమలు కుడా
అనుకోని ఉండవచ్చును "ఈ ప్రపంచములో మాకంటే తెలివైనవారు లేరని ,ఈ విశ్వములో మేము తప్ప ఎవ్వరూలేరని".మనమూ అలాగే అనుకొంటూ ఉన్నాము కదా .చీమలు అనుకోవడములో పెద్దగా ఆశ్చర్య పోవలసిన పనిలేదు.నిజంగా చీమలు తప్ప ప్రపంచములో ఎవ్వరూ లేరా?చీమలు చూడ లేనంతమాత్రానా ఉన్నవి అనేవి లేకుండా పోతాయా ?
అనంతమైన ఈ విశ్వాన్నేతీసుకోండి , బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము ఈ విశ్వము మహావిస్పోటనము వలన కలిగింది అనిచేబుతున్నారు.శక్తినిత్యత్వ నియమము ప్రకారము శక్తిని సృష్టించడము కాని నాశనము చేసడము కాని జరగదు అంటున్నారు . బిలము లో మహాశక్తి ఉంది అంటునారు .ఆ శక్తిని కన్నుకోవడానికి లేక్కలేన్నన్నిప్రయోగాలు చేస్తునారు. ఆ శక్తి ఉందంటారా ?
ఉంటే ఆ శక్తి ఏంటి ?
న్యూటన్ భూమ్యాకర్షణ శక్తి ఉందని కన్నుకొని సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఆ శక్తిని చూపించగాలిగారా?
అంటే శక్తికి ఉన్నా ఆ ధర్మాన్ని ఉపయోగించుకుంటూ జీవిస్తున్నాము కాని ఆ శక్తిని గురించిన విషయాలు మనకు తెలియవు.మరి దానిని సృష్టించాలంటే ఇంకెంత శక్తి కావాలి.
సకాలములో వర్షాలు రాకపోతే ఆకాశము వైపు చూస్తాము . ఏదో అతీతమైన శక్తి ఉండబట్టే కదా సరియైన ఋతువులలో మనకు వర్షాలు వస్తున్నాయి.వర్షాలు కురవడానికి మనిషి చేస్తున్నదేమీ లేదు కదా.
మనము పండించే పంటలను చూడు , వాటిని మొలిపించటానికి భూమికి ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చింది.
ఇలా వ్రాసుకుంటూ పొతే చాల ఉన్నాయి . మనిషి శక్తులను ఉపయోగించుకుంటూ బ్రతుకుతున్నాడే తప్ప , ఎటువంటి శక్తులను సృష్టించలేడు.
అంటే ఈ సృష్టిలో ఏదో అతీతమైన శక్తి ఉందన్నమాట .
ఆ శక్తి గురించి తర్వాతి భాగములో .........................
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి